Home Movie News 30 ఏళ్ల త‌ర్వాత బాబాయ్ తో ..!

30 ఏళ్ల త‌ర్వాత బాబాయ్ తో ..!

97
0
kalyana ram

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌తో రూపొందుతోన్న సంచ‌ల‌న చిత్రం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్.బి.కె ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి బాల‌కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్ర‌బాబు పాత్ర‌లో రానా, అక్కినేని పాత్ర‌లో సుమంత్, శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్..న‌టిస్తోన్న విష‌యాన్ని అఫిషియ‌ల్ గా తెలియ‌చేస్తూ..చిత్ర యూనిట్ వాళ్ల గెట‌ప్ ఇటీవ‌ల రిలీజ్ చేసింది.

నంద‌మూరి హ‌రికృష్ణ పాత్ర‌ను ఆయ‌న కుమారుడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ పోషిస్తున్నారు. ఈ విష‌యాన్ని అఫిషియ‌ల్ గా తెలియ‌చేస్తూ.. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ ఉన్న స్టిల్ ను రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. మా బాబాయ్ తో ‘బాలగోపాలుడు’ సినిమాలో  బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు బాబాయ్, వాళ్ల నాన్న గారిలా…నేను, మా నాన్నగారిలా న‌టిస్తున్నాను అంటూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here