Home Political News 7 మండ‌లాలు ఏపీకి వెళుతుంటే కేసీఆర్ ఎందుకు నోరు మూసుకున్నారు – కాంగ్రెస్ నేత పొన్నం...

7 మండ‌లాలు ఏపీకి వెళుతుంటే కేసీఆర్ ఎందుకు నోరు మూసుకున్నారు – కాంగ్రెస్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్

117
0

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్ర‌భాక‌ర్ గాంధీభ‌వ‌న్ లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ..కేసీఆర్ పై మండిప‌డ్డారు. విభజన హామీలు ఏవి కూడా అమలు కాకపోయినా బీజేపీకి టీఆర్‌ఎస్‌ అన్ని విషయాల్లో సహకరించిందని ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్‌కు వస్తున్నారని ప్రశ్నించారు. ఎక్కడ ఎన్నికలు  జరిగినా అమిత్‌ షా కంటే మందు ఏసీబీ, ఈడీ అధికారులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం.  బీజేపీ-టీఆర్‌ఎస్‌లు కావాలనే కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఫైర్ అయ్యారు. 119 స్థానాలలో పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్థులే లేరని, అందుకే టికెట్లు రాని వేరే పార్టీలలోని సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీకి వంద స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురూ ఒక్క‌టే అని.. బీజేపీకి ఓటు వేస్తే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్లేనని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థుల లిస్టు కూడా కేసీఆరే రెడీ చేసి అమిత్‌ షాకు పంపించారని ఆరోపించారు. రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం ఖాయం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here