Home Movie News 96 తెలుగు రీమేక్ టైటిల్ ఏంటి..?

96 తెలుగు రీమేక్ టైటిల్ ఏంటి..?

62
0

త‌మిళ్ లో సూపర్ స‌క్స‌స్ సాధించి చిత్రం 96. విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన 96 చిత్రానికి సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో శ‌ర్వానంద్ – స‌మంత న‌టిస్తున్నారు. త‌మిళ వెర్షెన్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్ష‌న్ కి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఇక టైటిల్ విష‌యానికి వ‌స్తే…ఈ మూవీలో హీరోయ‌న్ పేరు జాను అలియాస్ జాన‌కీదేవి. ఇప్పుడు జాను అలియాస్ జానకీదేవినే టైటిల్ గా పెట్టాల‌నుకుంటున్నార‌ట‌. ఈ టైటిల్ తో పాటు జాను అని పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నార‌ట‌. ఈ రెండు టైటిల్స్ తో పాటు 99 అనే టైటిల్ ను కూడా ప‌రిశీలిస్తున్నార‌ట‌. మార్చి 6న శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు. ఆ రోజున కానీ..సినిమా ప్రారంభం రోజున కానీ..టైటిల్ ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here