Home Telugu మ‌హాన‌టి రివ్యూ..!

మ‌హాన‌టి రివ్యూ..!

234
0

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. కీర్తి సురేష్ సావిత్రి పాత్ర‌ను పోషించ‌గా… ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించిన‌ వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌ సావిత్రి జీవితాన్ని సినిమాగా ప్రేక్ష‌కుల‌కు అందించ‌నుంద‌ని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అటు అభిమానుల్లో, ఇటు ఇండ‌స్ట్రీలో మ‌హాన‌టి పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే…ఒక సినిమా తీసిన అనుభ‌వం ఉన్న యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ సావిత్రి బ‌యోపిక్ ని తెర‌కెక్కించ‌డం అంటే సాహ‌స‌మే. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన మ‌హాన‌టి ఈరోజు (ఈనెల 9)న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి..నాగ్ అశ్విన్ సాహ‌సం స‌క్స‌స్ అయ్యిందా..? కీర్తి సురేష్ సావిత్రిగా మెప్పించిందా..? అనేది తెలియాలంటే మ‌హాన‌టి క‌థ చెప్పాలి.!

క‌థ – బెంగుళూరు చాళుక్య హాస్ప‌ట‌ల్ లో సావిత్రి (కీర్తి సురేష్) తీవ్ర అనారోగ్యంతో జాయిన్ అవుతుంది. అయితే..ఆమెని గుర్తుప‌ట్ట‌ని హాస్ప‌ట‌ల్ స్టాఫ్ సాధార‌ణ మ‌హిళ అనుకుంటారు. బెడ్ లు ఖాళీ లేవు అంటూ ఆమెకు రూమ్ కూడా ఇవ్వ‌కుండా నేల మీద ప‌డుకోబెడ‌తారు. ఆత‌ర్వాత ఈ విష‌యం తెలిసి అభిమానులు..సావిత్ర‌మ్మ‌ను చూడాలంటూ హాస్ప‌ట‌ల్ కి వ‌స్తారు. అప్పుడు హాస్ప‌ట‌ల్ వాళ్ల‌కి తెలుస్తుంది పేషెంట్ గా వ‌చ్చింది మ‌హాన‌టి సావిత్రి అని. అప్ప‌టి నుంచి ఏడాది పాటు సావిత్రి కోమాలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే…ప్ర‌జావాణి పత్రిక‌లో మ‌ధుర‌వాణి (స‌మంత‌) జ‌ర్న‌లిస్ట్ గా జాబ్ చేస్తుంటుంది. ఆమె జ‌ర్న‌లిస్ట్ గా మంచి స్టోరీస్ రాయాల‌నుకుంటుంది. సావిత్రి హాస్ప‌ట‌ల్ లో ఉంద‌నే న్యూస్ క‌వ‌ర్ చేయ‌డానికి స‌మంత వెళుతుంది. మ‌ధుర‌వాణితో పాటు ఫోటో జ‌ర్న‌లిస్ట్ ఆంటోని (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కూడా వెళ‌తాడు. సావిత్రికి అస‌లు ఏమైంది..? ఆమెకు ఈ ప‌రిస్థితులు రావ‌డానికి కార‌ణం ఏమిటి..? చివ‌రికి ఏం జ‌రిగింది అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్
కీర్తి సురేష్ – దుల్క‌ర్ స‌ల్మాన్ న‌ట‌న‌
బుర్రా సాయిమాధ‌వ్ సంభాష‌ణ‌లు
మిక్కీ జే మేయ‌ర్ సంగీతం
స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌
అక్కినేనిగా నాగ‌చైత‌న్య క‌నిపించ‌డం
నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌
వైజ‌యంతీ మూవీస్ నిర్మాణం

మైన‌స్ పాయింట్స్
అక్క‌డ‌క్క‌డా కాస్త స్లోగా అనిపించ‌డం..

విశ్లేష‌ణ – మ‌హాన‌టి సావిత్రి సినిమా తీయ‌డం..అది కూడా ఒక సినిమా అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడు తీయ‌డం..అందులో కీర్తి సురేష్ సావిత్రిగా న‌టించ‌డం అంటే..నిజంగా సాహ‌స‌మే. అయితే…ప‌ట్టుద‌ల ఉంటే కానిది లేదు. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ అండ్ టీమ్ సావిత్రి జీవితాన్ని తెర‌కెక్కించాలి అని ప‌ట్టుద‌ల‌తో ఈ సినిమాని తీసారు. దీని కోసం ఎంతో రీసెర్చ్ చేసారు. వీరి క‌ష్టం సినిమా చూస్తుంటే తెలుస్తుంది. సావిత్రి జీవితాన్ని ఏదో తీసేద్దాం అనే ఉద్దేశ్యంతో కాకుండా…ఎంతో ప్రేమ‌తో ఈ సినిమాని తీసారు. ప్రేమ‌తో చేసింది ఏదీ క‌ష్టంగా అనిపించ‌దు. అందుక‌నే అనుకుంట ఈ టీమ్ ఇంత అద్భుత‌మైన సినిమాని తీయ‌గ‌లిగారనిపిస్తోంది. మ‌హాన‌టి సినిమా చూసిన‌వాళ్లు ముందుగా చెప్పే మాట‌…కీర్తి సురేష్ గురించే. క‌థ ఎంత అద్భుతంగా రాసుకున్నా…ఆ పాత్ర‌లో న‌టించే న‌టీనటులు పాత్ర‌లో లీన‌మై న‌టించ‌క‌పోతే ఆ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేదు. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ క‌థ ఎంత బాగా రాసుకున్నాడో…ఈ టీమ్ ఎంత‌గా ఈ క‌థ‌ను ప్రేమించారో…కీర్తి సురేష్ కూడా అదే స్ధాయిలో ఈ సినిమా పై త‌న పాత్ర పై ప్రేమ చూపించింది కాబ‌ట్టే…సినిమా ఇంత అద్భుతంగా వ‌చ్చింది.

ముఖ్యంగా సావిత్రి సినిమాల్లోకి రాక ముందు నాట‌కాలు వేసే టైమ్ లో కీర్తి సురేష్ నే చూస్తున్నామ‌నిపించినా…ఆత‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చి దేవ‌దాసు, మాయాబ‌జార్ సినిమాల్లో న‌టిస్తున్న‌ప్పుడు కీర్తి సురేష్ సావిత్రిగా భ‌లే న‌టించిందే అనిపిస్తుంది. అలాగే గ్లిజ‌రిన్ లేకుండా సావిత్రి న‌టించిన స‌న్నివేశంలో కీర్తి చాలా బాగా న‌టించింది. ఇక సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ కు దూరంగా ఉంటూ ఆస్తులు పొగొట్టుకుని మందుకు బానిసైన‌ప్పుడు వ‌చ్చే స‌న్నివేశాల్లో అయితే…అచ్చు సావిత్రినే చూస్తున్నామా అనిపిస్తుంది. ఇది ఏ ఒక్క‌రి మాటో కాదు సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రి నోట ఇదే మాట‌.

ఇక జెమిని గ‌ణేష‌న్ గా దుల్క‌ర్ సల్మాన్ కూడా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా చాలా బాగా న‌టించాడు. సావిత్రి క‌థ‌తో పాటు మ‌ధుర‌వాణి, ఆంటోని ప్రేమ‌క‌థ‌ను చూపించ‌డం బాగుంది. సావిత్రి పెద‌నాన్న చౌద‌రి పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్, పెద్ద‌మ్మ‌గా భానుప్రియ‌, సావిత్రి త‌ల్లి పాత్ర‌లో దివ్య‌వాణి, ఎస్వీఆర్ గా మోహ‌న్ బాబు, కె.వి.రెడ్డి గా క్రిష్, సావిత్రి స్నేహితురాలు సుశీల‌గా షాలినీ పాండే…ఇలా ఈ సినిమాలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రు త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేసారు. ఈ సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ అంటే…నాగ‌చైత‌న్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగా న‌టించ‌డం. చైత‌న్య అక్కినేనిగా మూగ‌మ‌న‌సులు గెట‌ప్ లో క‌నిపించ‌డం బాగుంది. చైతుని అలా చూస్తుంటే…ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్ తీస్తే…చైతు ఎ.ఎన్.ఆర్ గా న‌టించ‌వ‌చ్చు అనిపించింది. వైజ‌యంతి మూవీస్ సంస్థ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలీటీతో నిర్మించింది. ఈ సినిమాని కేవలం సినిమాగా కాకుండా…నేటి త‌రానికి సావిత్రిమ్మ గురించి తెలియ‌చేయాలి అని ఎంతో ప్రేమ‌తో ఈ సినిమాని తీసారు. స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టు బుర్రా సాయిమాధ‌వ్ సంభాష‌ణ‌లు.. మిక్కీ జే మేయ‌ర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ రెండో సినిమాతోనే మ‌హాన‌టి సావిత్రమ్మ జీవితాన్ని అత్య‌ద్భుతంగా…అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించ‌డం నిజంగా అభినంద‌నీయం.

మ‌హాన‌టి రిలీజ్ డేట్ వెన‌కున్న ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!
కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం మ‌హాన‌టి. సావిత్రిగా కీర్తి సురేష్ న‌టిస్తోంద‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి…ఆమె ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌దా..? లేదా..? అనే సందేహం. అయితే…కీర్తి సురేష్ త‌న అభిన‌యంతో సావిత్రి పాత్ర‌లో మెప్పించి..అంద‌రి సందేహాల‌కు స‌మాధానం చెప్పి శ‌భాష్ అనిపించుకుంది. సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కు మ‌హాన‌టిలో కీర్తి న‌టించ‌లేదు..జీవించింది అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే…మ‌హాన‌టి చిత్రాన్ని మే 9న రిలీజ్ చేసారు.

ఈ రిలీజ్ డేట్ మే 9 వెన‌క ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఉంది. ఇంత‌కీ ఏంటంటే…స‌రిగ్గా 28 సంవ‌త్స‌రాల క్రితం ఇదే రోజున జ‌గ‌దేక‌వీరుడు – అతిలోక సుంద‌రి చిత్రం రిలీజైంది. మెగాస్టార్ చిరంజీవి – ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు – మెగా ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది. అయితే..జ‌గ‌దేశ‌కవీరుడు – అతిలోక సుంద‌రి రిలీజ్ రోజున భారీ వ‌ర్షం. దీంతో ఈ సినిమాకి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ల‌భిస్తుందా..? ల‌భించ‌దా..? అని తెగ టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌.

ఆఖ‌రికి నెక్ట్స్ డే నుంచి జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి థియేట‌ర్ల‌కు అభిమానుల రూపంలో వ‌ర‌ద రావ‌డం మొద‌లైంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాఘ‌వేంద్ర‌రావు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఇంకా ఏమ‌న్నారంటే…మా దత్తు గారికి ఆరోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికి మర్చిపోలేదు. అదే రోజైన‌ నేడు మహానటి విడుదలయింది. నాడు జగదేక వీరుడు అతిలోకసుందరి నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు మహానటి నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి. సావిత్రి గారి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ కి ధన్యవాదాలు . కీర్తి సురేష్ పాత్ర లో జీవించింది. జెమినీ గణేశన్ గా దుల్క‌ర్ స‌ల్మాన్ నటన అద్భుతం. నాగ అశ్విన్ మరియు చిత్ర యూనిట్ కి నా అభినందనలు అంటూ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు రాఘ‌వేంద్ర‌రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here