Home Tags Actor Naresh

Tag: Actor Naresh

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్. కొత్త క‌మిటీ తీసుకున్న నిర్ణ‌యాలు ఏంటి..?

యూనిటి, ట్రాన్ఫరెన్సీ, డెమొక్రసీ పద్ధతుల్లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ముందుకు సాగుతుంది. మా కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జనరల్‌ బాడీ మీటింగ్‌ స్నేహపూర్వకంగా, కోలాహ‌లంగా విజయవంతంగా సాగింది’ అని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ అన్నారు. నటుడు నరేష్‌ అధ్యక్షుడిగా ఇటీవల‌ కొత్త కమిటీ ఎన్నికైన‌ విషయం విదితమే. తొలిసారి జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ,‘మొదట ‘మా’లో చిన్న చిన్న మనస్పార్థాలు ఉండేవి. దీంతో ఎలా జరుగుతుందో అన్న భయం ఉండింది. కానీ బాగా జరిగింది. ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని ఊహించలేదు. సమావేశంలో కొంత ఆవేశానికి గురైనా, అంతిమంగా ఆరోగ్యకరంగా సాగడం ఆనందంగా ఉంది. మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ కలిసి అన్నీ సెట్‌ చేశారు’ అని అన్నారు.   ట్రెజరర్‌ రాజీవ్‌ కనకా మాట్లాడుతూ, ‘ఈ సమావేశంలో సీనియర్లు పరుచూరి బ్రదర్స్‌, దేవదాస్‌ కనకాల‌, కృష్ణంరాజు దంపతుల‌ను సత్కరించుకున్నాం. భవిష్యత్‌లో చేయాల్సిన పనుల‌పై చర్చించుకున్నాం. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాల‌ను తెలియజేశారు. వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తాం’అని చెప్పారు.  మా’ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ,‘మొదటి జనరల్‌ బాడీ మీటింగ్‌ చాలా బాగా జరిగింది.‘మా’కి గతంలో ఏఎన్నార్‌,ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి ముఖ్య సహాధారులుగా ఉండేవాళ్ళు. అలా ఈ సారి కృష్ణంరాజు గారిని ఎన్నుకున్నాం.ఈ సందర్భంగా వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. కొత్త కమిటీ వచ్చిన వారం రోజుల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశాం. 30కాల్స్‌ వచ్చాయి. సలహాల‌ బాక్స్‌కి మంచి స్పందన వచ్చింది. 33 మందికి ఇచ్చే పెన్షన్‌ ఆరు వేల‌కు చేశాం. మేడే రోజున‌ పెన్షన్‌ డేగా జరుపుకోబోతున్నాం. మెంబర్‌ షిప్ ని కొత్త‌వాళ్ళ‌కి రూ.25వేల‌కు ఇవ్వాల‌ని, రెండేండ్లు 25వేల చొప్పున చెల్లిస్తే పూర్తి స్థాయి మెంబర్‌ షిప్‌ వస్తుంది. అలాగే 90 రోజులు పూర్తి పేమెంట్‌ కడితే పది శాతం డిస్కౌంట్‌ ఇవ్వాల‌ని నిర్ణయించాం.    ఇన్సురెన్స్‌ తీసుకొచ్చాం. మెడిక్లేయిమ్‌ ద్వారా రూ 29 ల‌క్షలు జమ అయ్యింది. దీని ప్రకారం ప్రతి ఆర్టిస్టుకి మూడు ల‌క్ష‌ల ఇన్స్ రెన్స్ వర్తింప చేస్తున్నాం. డబుల్‌ బెడ్ రూమ్‌ ఇండ్లు,3 నుంచి ఐదు ల‌క్షల‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆర్టిస్టుల‌కి వర్తించేలా చేస్తామని మంత్రి తల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ హామీ ఇచ్చారు.30 మందికి ప్ర‌భుత్వ పెన్ష‌న్స్ ఇవ్వ‌నున్నాం. అలాగే కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌థ‌కాలు వ‌ర్తింప చేస్తామ‌ని మంత్రి చెప్పారు.‘మా’ బిల్డింగ్‌ కోసం చిరంజీవి సపోర్ట్‌ చేస్తానన్నారు. మంత్రి గారు కూడా ల్యాండ్‌ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఫిల్మ్‌ నగర్‌లో ఇవ్వాల‌ని కోరుతున్నాం. భవిష్యత్‌లో హీరోల‌తో పాటు ప్రజలతో మమేకమై రెండు తెలుగు స్టేట్స్ లో మంచి కార్యక్రమాలు చేయాల‌నుకుంటున్నాం. గర్వించే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సాధించిన కెసిఆర్ కి, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు’ అని చెప్పారు. 

ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌లివేంద్రాన్ని ప్రారంభించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్..!

ఫిలింనగర్ ఫిలించాంబర్ వద్ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు నరేష్ విజయ్ కృష్ణ, జనరల్ సెక్రటరీ జీవితారాజశేఖ‌ర్, మా ట్రెజరర్ రాజీవ్...

నాగ‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా – శివాజీరాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ఇటీవ‌ల జ‌ర‌గ‌డం..శివాజీరాజా పై న‌రేష్ గెల‌వ‌డం తెలిసిందే. ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డంతో వివాద‌స్ప‌ద‌మైంది. ఎన్నిక‌లు అనంత‌రం...

మంత్రి తలసానితో ‘మా’ నూతన కార్యవర్గం భేటీ.!

నూతనంగా ఎన్నికైన ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్, జాయింట్ సెక్రెటరీ శివబాలాజీ, ఈసీ మెంబర్ సురేష్ కొండేటితో పాటు మరికొంత మంది సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ...

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో న‌రేష్ విజయం..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి శివాజీరాజా, న‌రేష్ మ‌ధ్య హోరాహోరి పోటీ జ‌రిగింది. ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఓటింగ్...

న‌రేష్, రాజశేఖ‌ర్ ప్యాన‌ల్ కు స‌పోర్ట్ చేస్తున్న నాగ‌బాబు. ఎందుకో తెలుసా..?

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన మద్దతు నరేష్, రాజశేఖర్ ప్యానల్ కు ఉంటుందని ప్రకటించారు....

న‌రేష్ అంత‌లా అవ‌మానించినా..అందుకే పోటీ చేస్తున్నాను – శివాజీరాజా..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ఈ నెల 10న జ‌ర‌గ‌నున్నాయి. శివాజీరాజా, న‌రేష్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్నారు. పోటాపోటీగా ప్ర‌చారం చేయ‌డంతో...ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటుండ‌డంతో...

మా ఎన్నిక‌ల్లో గెలిచేది ఎవ‌రో ముందే చెప్పేసిన‌ బ్ర‌హ్మానందం.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ఈ నెల 10న జ‌ర‌గ‌నున్నాయి. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతోన్న‌ శివాజీరాజా, న‌రేష్ పోటాపోటీగా ప్ర‌చారం చేస్తున్నారు. ...

చిత్ర‌పురి కాల‌నీలో మా ఎన్నిక‌ల ప్రచారం. ఇంత‌కీ గెలిచేది ఎవ‌రు..?

ఈ నెల 10 మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న శివాజీరాజా, న‌రేష్ పోటాపోటీగా ప్ర‌చారం చేస్తున్నారు. శివాజీరాజా, బెనర్జీ,ఉత్తేజ్,ఏడిద శ్రీరామ్,బ్రహ్మాజీ,కొండేటి సురేష్ నాగినీడు తదితరులు..చిత్రపురి కాలనీ లో ఉంటున్న నటీనటులను కలవటం...

శివాజీరాజాతో పోటీకి న‌రేష్ సై అన‌డానికి అస‌లు కార‌ణం..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఈ నెల 10 జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి అధ్య‌క్ష ప‌ద‌వికి శివాజీరాజా, న‌రేష్ పోటీ పడుతున్నారు. ఇటు శివాజీరాజా, అటు న‌రేష్...